Video: వీడియో ఇదిగో, బుసలు కొడుతున్న పాము కాటు నుంచి తృటిలో తప్పించుకున్న చిన్నారి

కర్ణాటక (Karnataka) రాష్ట్రం బెళగావి (Belagavi) జిల్లాలో గల హలగా గ్రామంలో ఓ బాలిక (young girl) పాము కాటు నుంచి తృటిలో తప్పించుకుంది. అదృష్టవశాత్తు పాము కాటు (Snake Bite) నుంచి కొద్దిలో బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Representational image of snakes | (Photo Credits: PTI)

కర్ణాటక (Karnataka) రాష్ట్రం బెళగావి (Belagavi) జిల్లాలో గల హలగా గ్రామంలో ఓ బాలిక (young girl) పాము కాటు నుంచి తృటిలో తప్పించుకుంది. అదృష్టవశాత్తు పాము కాటు (Snake Bite) నుంచి కొద్దిలో బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ ఇంటి గుమ్మం దగ్గర పాము బుసలు కొడుతూ ఉంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన బాలిక.. పామును గమనించకుండా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది.

డోర్‌ వద్దకు రాగానే పాము బాలికను కాటేయబోయింది. కుటుంబ సభ్యులు అప్రమత్తం చేయడంతో ఆ చిన్నారి ఒక్కసారిగా వెనక్కి వచ్చింది. అనంతరం ఇంట్లోకి పరుగులు తీసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో (CCTV footage) రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement