Kurnool Shocker: వైరల్ వీడియో, ఇష్టం లేకుండా లిప్ కిస్ పెట్టాడని భర్త నాలుకను కొరికేసిన భార్య, కర్నూలులో దారుణం

ఒకరు ఒకరి మీద దాడి చేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మనోడు వెళ్లి లిప్ కిస్ కోసం ట్రై చేశాడు, అప్పటికే పీక ల్లోతు కోపంతో ఉన్న ఆమె వెంటనే భర్త నాలుకను కొరికేసింది.

Credits: Twitter

కర్నూలు - తారాచంద్ నాయక్‌.. పుష్పవతిని 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన కొన్నాళ్ల పాటు ఇద్దరూ బాగానే అన్యోన్యంగా ఉన్నారు. రెండేళ్ల నుంచి వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం కూడా వారిద్దరూ గొడవపడ్డారు. ఒకరు ఒకరి మీద దాడి చేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మనోడు వెళ్లి లిప్ కిస్ కోసం ట్రై చేశాడు, అప్పటికే పీక ల్లోతు కోపంతో ఉన్న ఆమె వెంటనే భర్త నాలుకను కొరికేసింది. ఇక ఈ విషయమై భార్యాభర్తల వర్షన్ వేరుగా ఉంది. తనపై తారాచంద్ దాడి చేశాడని.. ఆపై తనకు ఇష్టం లేకుండా బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి వచ్చాడని అందుకే నాలుక కొరికానని పుష్పవతి జొన్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక తారాచంద్ మీడియాతో మాట్లాడుతూ.. తన భార్యకు వేరొక వ్యక్తితో అఫైర్ ఉందని అయినా కూడా తాను సర్దుకుపోతున్నానని తెలిపాడు. తన భార్యతో తనకు ముప్పు ఉందని చెప్పాడు. తన పిల్లలూ.. తాను ఎలా బతకాలో తెలియడం లేదని వాపోయాడు.

Credits: Twitter

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement