Lip-Lock Challenge in Karnataka: లిప్ లాక్ ఛాలెంజ్ దుమారం, కర్ణాటకలో నడి రోడ్డు మీద కిస్సింగ్ ఛాలెంజ్ విసిరిన విద్యార్థులు, 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

కర్ణాటక మంగళూరులో ప్రముఖ కాలేజీ విద్యార్థులు.. యువతీ యువకులు నడిరోడ్డుపై పోటీపడి ముద్దులు పెట్టుకోగా.. మిగిలిన వారు చుట్టూ చేరి కేరింతలు కొడుతూ వారిని ‘ఎంకరేజ్ ’ చేశారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు.

Karnataka Police (Photo Credits: Twitter@DgpKarnataka | Representational Image)

కర్ణాటక మంగళూరులో ప్రముఖ కాలేజీ విద్యార్థులు.. యువతీ యువకులు నడిరోడ్డుపై పోటీపడి ముద్దులు పెట్టుకోగా.. మిగిలిన వారు చుట్టూ చేరి కేరింతలు కొడుతూ వారిని ‘ఎంకరేజ్ ’ చేశారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ వీడియోలో ‘దమ్ముంటే మీరు కూడా ఇలా చేయండి’ అంటూ తోటి విద్యార్థులకు సవాల్ విసిరారు. లిప్ లాక్ ఛాలెంజ్ పేరిట చేసిన ఈ రచ్చతో ఆ కాలనీవాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

అక్కడున్న ఓ ఇంట్లోని వ్యక్తి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అతి తక్కువ సమయంలోనే వైరల్ అయిన ఈ దృశ్యాలు.. దక్షిణ కన్నడ జిల్లా వ్యాప్తంగా దుమారం రేపాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. వీడియోలో ముద్దులు పెడుతూ కనిపించిన విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అక్కడున్న వారు డ్రగ్స్ సేవించి ఉన్నారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement