Viral Video: వీడియో ఇదిగో, మూడు సింహాలకు చుక్కలు చూపించిన చిట్టి ముంగీస, దాని ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్న నెటిజన్లు

little mongoose that scared the lions..! Here is the video

Mongoose Scared Lions Video: సింహాలను అనూహ్యంగా ఓ చిట్టి ముంగీస భయపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను పోస్ట్ చేసిన రెండు రోజుల్లో దానికి సుమారు 8.5 లక్షల వ్యూస్ లభించాయి. వీడియోలో బొరియ సమీపంలో మూడు ఆడ సింహాలు సేదతీరుతుండగా ఒక్కసారిగా అందులోంచి ముంగీస బయటకు వచ్చింది. కోపంతో గట్టిగట్టిగా అరవగా దాని దెబ్బకు ఉలిక్కిపడింది. దూరంగా ఉన్న మరో సింహం పరుగెత్తుకు వచ్చింది. ఆ రెండు సింహాలను చూడగానే ముంగీసకు మరింత కోపం వచ్చింది. ఎండ కోసం నీటిలో నుండి బయటకు వచ్చిన మొసలి, మళ్లీ నీళ్లలోకి వెళ్లలేక అవస్థలు, వీడియో ఇదిగో..

ఆ రెండో సింహంపైకి దూకుడుగా దూసుకెళ్లింది. దాని ముందటి కాళ్లు, ముఖంపై కొరికి గాయపరిచేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ సింహం వెనకడుగు వేస్తూనే కనిపించింది. మరో సింహం ఆశ్చర్యపోయి చూస్తుండిపోయింది. చివరకు ఇంకో సింహం తోకను కూడా కొరికేందుకు ముంగీస ప్రయత్నించినా అది త్రుటిలో తప్పించుకుంది. నేచర్ ఈజ్ అమేజింగ్ పేరుతో ఉన్న హ్యాండిల్ ‘ఎక్స్’లో తొలుత ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఆ తర్వాత దాన్ని క్రేజీ క్లిప్స్ అనే మరో హ్యాండిల్ రీపోస్ట్ చేసింది. దీన్ని చూసిన నెటిజన్లు ముంగీస ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు