Maggi Chai: మ్యాగీ ఛాయ్.. నూడుల్స్‌తో ఛాయ్, వైరల్ వీడియో, టీ ప్రేమికులు షాక్!
అవును మీరు చదువుతుంది నిజమే. నూడుల్స్‌తో ఛాయ్ తయారు చేశాడు ఓ టీ స్టాల్ ఓనర్. ఇది చూసి టీ ప్రేమికులు షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి మట్టి గ్లాస్‌లో వేడి చాయ్ పోస్తాడు
అవును మీరు చదువుతుంది నిజమే. నూడుల్స్‌తో ఛాయ్(Maggi chai) తయారు చేశాడు ఓ టీ స్టాల్ ఓనర్. ఇది చూసి టీ ప్రేమికులు షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి మట్టి గ్లాస్‌లో వేడి చాయ్ పోస్తాడు(Noodles In to Chai). అందులో నూడుల్స్(మ్యాగీ) వేస్తాడు. టేస్ట్ సంగతి పక్కన పెడితే చూడటానికి షాకింగ్‌గా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మ్యాగీ ఛాయ్‌కి(Maggi Chai) న్యాయం చేయండి అనే క్యాప్షన్‌తో షేర్ అయిన ఈ వీడియోను చూసిన టీ, మాగీ ప్రేమికులు అసహనంతో స్పందించారు. చాయ్ అనేది చాలా మందికి కేవలం ఒక పానీయం మాత్రమే కాదు – అది భావోద్వేగం. అదే విధంగా, మాగీ నూడుల్స్ కూడా చాలా మందికి స్నాక్ గా, మధ్యాహ్న భోజనం లేదా మిడ్‌నైట్ క్రేవింగ్‌గా ఉంటుంది. దయచేసి మ్యాగీని ఒంటరిని వదిలేయండి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
షాకింగ్ వీడియో, నదిలో స్నానం చేస్తుండగా వచ్చిన ముసలి.. భయంతో ఎలా పడవలోకి జంప్ చేశాడో చూడండి
ఛాయ్‌తో మ్యాగీ ఏంటి అని మరికొంతమంది అసహనం వ్యక్తం చేశారు. మ్యాగీ కోసం పోరాడాలో, లేక చాయ్ తాగాలో అర్థం కావడం లేదు అంటూ మరికొంతమంది తెలిపారు. అయితే వీడియో చివరలో ఈ మ్యాగీ ఛాయ్‌ని డస్ట్ బిన్‌లో పడేయటం విశేషం.
Maggi chai .. Noodles Into Chai, video goes viral
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)