Maha Kumbh Mela 2025: వీడియో ఇదిగో, మహా కుంభమేళాలో ఒక్క రోజే కోటి మంది పుణ్యస్నానాలు,భక్తులతో కిటకిటలాడుతున్న త్రివేణి సంగమంలోని పుష్కర ఘాట్‌లు
తొలిరోజే మహా కుంభమేళా (Maha Kumbh) కు భక్తులు (Devotees) భారీ సంఖ్యలో పోటెత్తారు. భక్తజన సందోహంతో ప్రయాగ్‌రాజ్ (Prayagraj) పరిసరాలు , త్రివేణి సంగమంలోని పుష్కర ఘాట్‌లన్నీ కిటకిటలాడుతున్నాయి. తొలిరోజైన సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు దాదాపు ఒక కోటి మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు నిర్వాహకులు తెలిపారు
తొలిరోజే మహా కుంభమేళా (Maha Kumbh) కు భక్తులు (Devotees) భారీ సంఖ్యలో పోటెత్తారు. భక్తజన సందోహంతో ప్రయాగ్‌రాజ్ (Prayagraj) పరిసరాలు , త్రివేణి సంగమంలోని పుష్కర ఘాట్‌లన్నీ కిటకిటలాడుతున్నాయి. తొలిరోజైన సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు దాదాపు ఒక కోటి మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు నిర్వాహకులు తెలిపారు. తొలిరోజే ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు కుంభమేళాలో పాల్గొంటే మొత్తం 45 రోజుల్లో వచ్చే భక్తుల సంఖ్య అంచనాలకు మించి 45 కోట్లను దాటే అవకాశం ఉంది. ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాల కోసం భక్తకోటి తరలివచ్చిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
ప్రారంభమైన మహాకుంభమేళా, నిన్న రాత్రి వరకే 85 లక్షల మందికి పైగా భక్తుల పుణ్యస్నానాలు
Maha Kumbh Mela 2025:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)