Kumbh Mela (Photo Credits: Wikimedia Commons)

Prayagraj, JAN 13: కుంభమేళా(Kumbh Mela) సోమవారం ప్రారంభంకాగా దీనికి ముందుగానే అంటే ఆదివారం రాత్రి 10 గంటల వరకు, 85 లక్షల మంది భక్తులు సంగమతీరంలో (triveni sangam) స్నానాలు చేశారు. జనవరి 11, శనివారం నాడు 35 లక్షల మంది భక్తులు మహా కుంభమేళాలో (Mahakumbh) స్నానం చేశారు. జనవరి 12వ తేదీ ఆదివారం రాత్రి 10 గంటల వరకు ఆ  రోజున 50 లక్షల మంది భక్తులు ఇక్కడ స్నానాలు చేశారు. ఈ విధంగా, రెండు రోజుల్లో మొత్తం 85 లక్షల మంది భక్తులు మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు (Prayagraj) మహా కుంభమేళాకు ముందుగానే భక్తులు చేరుకున్నారు. వారు గంగా, యమున సరస్వతీ నదుల సంగమంలో స్నానమాచరించారు.

Bhogi Festival in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సెలబ్రేషన్స్‌, పలు ప్రాంతాల్లో భోగిమంటలు వేసిన ప్రముఖులు 

శనివారం 35 లక్షల మంది భక్తులు సంగమంలో స్నానం చేయడానికి వచ్చారని సమాచార డైరెక్టర్ శిశిర్ తెలిపారు. గత రెండు రోజుల్లో (శని, ఆదివారాలు) సంగంలో 85 లక్షలకు పైగా ప్రజలు స్నానం చేశారని తెలిపారు.

Devotees Take Holy Dip in Triveni Sangam

 

ఈ మహా కుంభమేళాకు 45 కోట్లకు పైగా ప్రజలు వస్తారని, ఇది చరిత్ర(History)లో అతిపెద్ద మేళాగా మారనుందని అధికారి తెలిపారు. మహా కుంభమేళాలో మొదటి అమృత స్నానం (రాజ స్నానం) జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా జరగనుంది. ఈ సమయంలో అఖాడాలు తమ సంప్రదాయాల ప్రకారం స్నానాలు ఆచరించనున్నారు.