Maharashtra: షాకింగ్ వీడియో.. పోలీసుల ముందే వ్యాన్‌లో కేక్ కట్ చేసిన బడా క్రిమినెల్, పుట్టిన రోజు కేక్‌ను కోసి అనుచరులకు పంచి పెట్టిన గ్యాంగ్‌స్టర్, మహారాష్ట్ర పోలీసులపై తీవ్ర విమర్శలు

పలు హత్య కేసుల్లో నిందితుడైన మహరాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాస్‌నగర్‌కు చెందిన రోషన్‌ ఝాని పోలీసులు అరెస్టుచేసి జైలుకు తరలించారు. కేసు విచారణలో భాగంగా జైలు నుంచి కోర్టుకు పోలీస్‌ వ్యాన్‌లో తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో జైలు బయట గుమికూడిన అతని అనుచరులు వ్యాన్‌ ఆపారు.

Murder accused cuts birthday cake while sitting inside police van

పలు హత్య కేసుల్లో నిందితుడైన మహరాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాస్‌నగర్‌కు చెందిన రోషన్‌ ఝాని పోలీసులు అరెస్టుచేసి జైలుకు తరలించారు. కేసు విచారణలో భాగంగా జైలు నుంచి కోర్టుకు పోలీస్‌ వ్యాన్‌లో తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో జైలు బయట గుమికూడిన అతని అనుచరులు వ్యాన్‌ ఆపారు. అతని బర్త్‌డే సందర్భంగా ఓ కేక్‌ తీసుకొచ్చారు. పోలీస్‌ వ్యాన్‌లో నుంచే అతడు ఆ కేక్‌ను కోసి వారికి పంచాడు. దీన్నంతా గ్యాంగ్‌స్టర్‌ అనుచరులు వీడియోతీసి తమ వాట్సప్‌ స్టేటసుల్లో పెట్టుకున్నారు. అదికాస్తా వైరల్‌ అవడంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంత జరుగుతున్నా పోలీసులు అడ్డుకోకపోగా కనీసం అభ్యంతరమూ చెప్పలేదు. దీంతో పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇక బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడికి అంత స్వేచ్ఛ ఇవ్వడమేంటని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement