Uttar Pradesh Shocker: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. భార్యపై గ్యాంగ్ రేప్, న్యాయం కోసం పోరాడిని వ్యక్తి సజీవ దహనం, కేసు ఉపసంహరించుకోనుందుకు ఘాతుకం, వీడియో

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. కేసు ఉపసంహరించుకోనందుకు ఓ వ్యక్తిని సజీవ దహనం చేశారు . మైన్‌పురిలో జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.

Man Burned Alive for Seeking Justice at Uttar Pradesh(video grab)

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. కేసు ఉపసంహరించుకోనందుకు ఓ వ్యక్తిని సజీవ దహనం చేశారు(Uttar Pradesh Shocker). మైన్‌పురిలో జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. తన భార్యపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న మొహమ్మద్ సాజిద్‌ను భోలా యాదవ్ మరియు అతని అనుచరులపై కేసును ఉపసంహరించుకోవడానికి నిరాకరించినందుకు సజీవ దహనం చేశారు.

భోలా యాదవ్...సాజిద్ భార్యను కిడ్నాప్ చేసి నాలుగు నెలల పాటు లైంగిక వేధింపులకు గురి చేశాడు. దీంతో సాజిద్.. భోలా యాదవ్, అతని ముగ్గురు కుమారులతో పాటు మరో ఇద్దరపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

 వీడియో ఇదిగో, రైల్వే స్టేషన్లో కుప్పకూలిన ప్రయాణికురాలికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన మహిళా కానిస్టేబుల్, సోషల్ మీడియాలో ప్రశంసలు

జైలుకు వెళ్లిన భోలా యాదవ్..బెయిల్‌పై విడుదలై సాజిద్ దంపతులపై బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో సాజిద్ న్యాయం కోసం పోరాడుతూ, చివరికి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఫిబ్రవరి 20న విచారణ ఉండాల్సి ఉంది. కోర్టు విచారణకు ముందు, నిందితులు సాజిద్‌ను పొలాల వద్దకు తీసుకెళ్లి, దారుణంగా కొట్టి, అతనిపై డీజిల్ పోసి నిప్పంటించారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, సాజిద్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు.

Man Burned Alive for Seeking Justice at Uttar Pradesh

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now