Viral Video: షాకింగ్ వీడియో, నదిలో స్నానం చేస్తుండగా వచ్చిన ముసలి.. భయంతో ఎలా పడవలోకి జంప్ చేశాడో చూడండి
భూమిపై నూకలు ఉండటం అంటే ఇదేనేమో. ఒక వ్యక్తి నదిలో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా మొసలి వచ్చింది. తన కాలికి ఏదో తాకగా చేతితో పైకి లేపి చూడగా మొసలి.
భూమిపై నూకలు ఉండటం అంటే ఇదేనేమో. ఒక వ్యక్తి నదిలో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా మొసలి వచ్చింది. తన కాలికి ఏదో తాకగా చేతితో పైకి లేపి చూడగా మొసలి. వెంటనే దానిని నీళ్లలోకి వదిలేసి పక్కనే ఉన్న పడవలోకి అమాంతం దూకేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు ఆ వ్యక్తి. అయితే ఈ ఘటన ఎక్కడి జరిగిందో మాత్రం తెలియరాలేదు. ఈ వీడియోను bajoellente11 అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా ఇప్పటివరకు 6.57 లక్షల లైక్స్ వచ్చాయి.
దీనిపై నెటిజన్లు తమదైన శైలీలో కామెంట్ చేస్తున్నారు. చాలామంది అతన్ని ‘అదృష్టవంతుడు’ అంటూ కామెంట్ చేయగా యముడు సెలవుపై ఉన్నాడేమోనని మరికొంతమంది సరదాగా సెటైర్లు వేశారు.
Man Escapes Deadly Crocodile Attack
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)