Mini Garden in Rickshaw: రిక్షా మీద గడ్డిని పెంచి దాన్ని మినీగార్డెన్‌గా మార్చేసిన రిక్షావాలా, సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోన్న ఫోటో

ఓ వ్యక్తి తన రిక్షానే మినీగార్డెన్‌గా మార్చేశాడు. రిక్షాని చక్కని పూల మెక్కలు, పచ్చదనంతో నింపేశాడు. అంతేకాదు రిక్షాలో చిన్న చిన్న పూలకుండీలను కూడా ఏర్పాటు చేశాడు. ఈ మేరకు ఆ వ్యక్తి రిక్షా​​కు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

Mini Garden in Rickshaw(Photo-Twitter/Erik Solheim)

ఓ వ్యక్తి తన రిక్షానే మినీగార్డెన్‌గా మార్చేశాడు. రిక్షాని చక్కని పూల మెక్కలు, పచ్చదనంతో నింపేశాడు. అంతేకాదు రిక్షాలో చిన్న చిన్న పూలకుండీలను కూడా ఏర్పాటు చేశాడు. ఈ మేరకు ఆ వ్యక్తి రిక్షా​​కు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. అవి కాస్త యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్‌హీమ్‌ని తెగ ఆకర్షించాయి. ఆయన ట్విట్టర్‌లో ...ఈ భారతీయుడు ఎండలో కూడా చల్లగా ఉండేందుకు తన రిక్షా మీద గడ్డిని పెంచాడు. నిజంగా చాలా బాగుంది!. ఈ వేసవి వేడి తట్టుకునేందుకు ఇలా పచ్చటి మొక్కలతో రిక్షాని ఏర్పాటు చేసుకున్నాడు కాబోలు. అని అన్నారు. అంతేకాదు నెటిజన్లు కూడా ఆ రిక్షా డ్రైవర్‌ సృజనాత్మకతను మెచ్చుకోవడమే కాకుండా కస్టమర్‌లను ఆకర్షించేందకు ఇది చాల చక్కటి మార్గం అంటూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement