Mohan Babu's Staff Hunted Wild Boar: వీడియో ఇదిగో, అడవి పందిని వేటాడి చంపిన మోహన్ బాబు మేనేజర్
వేటాడిన అడవి పందిని వారు మోసుకొస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వెనుక ఉన్న అటవీప్రాంతంలో మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ దుర్గాప్రసాద్ అడవి పందిని వేటాడారు. వేటాడిన అడవి పందిని వారు మోసుకొస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అడవి పందులను వేటాడొద్దని వీరిద్దరికీ మంచు మనోజ్ పలుమార్లు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, ఆయన మాటను పట్టించుకోకుండా అడవి పందిని వారు వేటాడారు. అయితే అడవి పందిని వీరు ఎప్పుడు వేటాడారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. వీరు అడవి పందిని వేటాడిన సమయంలో మోహన్ బాబు ఇంట్లో లేరని తెలుస్తోంది.
Mohan Babu's staff hunted wild boar
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)