Manipur Violence: మణిపూర్ హింసాత్మక ఘటనల్లో మరో దారుణం.. జాతీయ క్రీడాకారుడి తలలో 61 మేకులు.. వైరల్‌గా మారిన ఫొటోలు

మైతీ కుకీల తెగల మధ్య ఐదు నెలలుగా సాగుతున్న ఘర్షణలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ మండిపోతున్నది. ఆందోళనకారులతో పాటు శాంతిభద్రతలను కాపాడేందుకు మోహరించిన సాయుధ బలగాల కర్కశానికి సామాన్యులు బలైపోతున్నారు.

Manipur Violence (Credits: X)

Newdelhi, Oct 8: మైతీ, కుకీల తెగల మధ్య ఐదు నెలలుగా సాగుతున్న ఘర్షణలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ (Manipur) మండిపోతున్నది. ఆందోళనకారులతో పాటు శాంతిభద్రతలను కాపాడేందుకు మోహరించిన సాయుధ బలగాల కర్కశానికి సామాన్యులు బలైపోతున్నారు. సాయుధ బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో అక్కడ మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు ముందస్తు హెచ్చరికలు లేకుండాలని పెల్లెట్‌ గన్నులతో జవాన్లు (Jawans) కాల్పులు జరపగా.. జాతీయ క్రీడాకారుడు ఉత్తమ్‌ సాయిబామ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి తలలో 61 మేకులు దిగాయి. ప్రస్తుతం అతడు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. తిరిగి అతడు మైదానంలో దిగుతాడో లేదో తెలియడం లేదు. కాగా, అతని తల ఎక్స్‌ రే ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tea ATM in Hyderabad: హైదరాబాద్ కి టీ ఏటీఎం.. క్యూఆర్‌ కోడ్‌పై స్కాన్‌ చేసి ఆప్షన్స్‌ ఆధారంగా ఆపరేట్‌ చేస్తే కావాల్సిన ఐటమ్స్.. మెనూలో టీ, కాఫీ, లెమన్‌ టీ, బాదం, పాలు, బిస్కెట్స్‌, వాటర్‌ బాటిల్‌

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement