Tea ATM (Credits: X)

Hyderabad, Oct 8: హైదరాబాద్ (Hyderabad) నగరంలోకి టీ ఏటీఎం (Tea ATM) వచ్చేసింది. ఎల్బీనగర్‌ (LB Nagar) బస్‌ స్టాప్‌ పక్కన శనివారం ఈ టీ ఏటీఎం ప్రారంభమైంది. వెండింగ్‌ టెక్నాలజీలో కొత్త ఒరవడి సృష్టించిన హైదరాబాద్‌ కు చెందిన జెమ్‌ ఓపెన్‌ క్యూబ్‌ సంస్థ దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సంస్థ గతంలో గోల్డ్‌ ఏటీఎంను నగరానికి పరిచయం చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ టీ ఏటీఎంలో కాఫీ, లెమన్‌ టీ, బాదం, పాలు, బిస్కెట్స్‌, వాటర్‌ బాటిల్‌ అందుబాటులో ఉంటాయి. 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.

IVF Centre in Gandhi Hospital: సంతానం లేని దంపతులకు కేసీఆర్ సర్కారు గుడ్‌ న్యూస్‌.. ప్రజల కోసం రాష్ట్రంలో తొలిసారిగా గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్‌ సెంటర్‌

ఎలా టీ వస్తుందంటే?

క్యూఆర్‌ కోడ్‌పై స్కాన్‌ చేసి ఆప్షన్స్‌ ఆధారంగా ఆపరేట్‌ చేస్తే మనకు కావాల్సినవి వచ్చేస్తాయి. ఈ కార్యక్రమంలో జెమ్‌ఓపెన్‌ క్యూబ్‌ సీఈఓ వినోద్‌ కుమార్‌, డైరెక్టర్‌ వెంకటేశ్‌ యాదవ్‌, త్రిలోచనద తదితరులు పాల్గొన్నారు.

Fire Accident in Karnataka: బాణసంచా పేలి 12 మంది దుర్మరణం.. కర్ణాటకలోని అత్తిబెలెలోగల గోడౌన్‌ లో ఘటన.. శివకాశి నుంచి వచ్చిన బాణసంచా లోడు దించుతుండగా చెలరేగిన మంటలు