IVF Centre in Gandhi Hospital (Credits: X)

Hyderabad, Oct 8: సంతానం లేని దంపతులకు తెలంగాణ సర్కారు (Telangana Government) శుభవార్త చెప్పింది. ప్రజల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఇన్‌-విట్రో-ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌-IVF) సెంటర్‌ ను అందుబాటులోకి తెస్తున్నది. రూ.5 కోట్లతో గాంధీ దవాఖానలో (Gandhi Hospital) సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మాతా, శిశు ఆరోగ్య కేంద్రం భవనంలోని ఐదో అంతస్థులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఆదివారం మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభిస్తారని దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం రాజారావు తెలిపారు.

Fire Accident in Karnataka: బాణసంచా పేలి 12 మంది దుర్మరణం.. కర్ణాటకలోని అత్తిబెలెలోగల గోడౌన్‌ లో ఘటన.. శివకాశి నుంచి వచ్చిన బాణసంచా లోడు దించుతుండగా చెలరేగిన మంటలు

అలా ఇప్పటివరకు 200 మహిళలకు సంతానం

2018 నుంచి గాంధీ దవాఖానలో ఐయూఐ విధానం ద్వారా సంతాన సాఫల్య కేంద్రం నిర్వహిస్తున్నామని, మందులు వాడటంతో ఇప్పటివరకు 200 మహిళలకు సంతానం కలిగిందని చెప్పారు. ఇప్పుడు మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ఐవీఎఫ్‌ విధానాన్ని అందుబాటులోకి తేవడం శుభపరిణామమని సంతాన సాఫల్య కేంద్రం నోడల్‌ అధికారి, గైనకాలజీ విభాగం ప్రొఫెసర్‌ వెల్లంకి జానకీ తెలిపారు.

YS Jagan Met Amit Shah: కేంద్రహోంమంత్రితో వైయస్ జగన్ కీలక భేటీ, ఇరువురి సమావేశంలో దానిపైనే కీలక చర్చ జరిగిందంటూ వార్తలు, సమావేశంలో చర్చించిన అంశాలపై రకరకాల ఊహాగానాలు