Karnataka: ఆకాశం నుంచి ఇంటి మీద పడిన పెద్ద యంత్రం, రెడ్ లైట్ వెలగడంతో భయంతో పరుగులు పెట్టిన స్థానికులు, తీరా పోలీసులు వచ్చాక తెలిసింది ఏమిటంటే..
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్) నుంచి వచ్చిన భారీ పరిశోధన బెలూన్ ఈ తెల్లవారుజామున బీదర్ జిల్లా హోమ్నాబాద్ తాలూకాలోని జలసంగి గ్రామంలోని ఓ ఇంటిపై పడింది.
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్) నుంచి వచ్చిన భారీ పరిశోధన బెలూన్ ఈ తెల్లవారుజామున బీదర్ జిల్లా హోమ్నాబాద్ తాలూకాలోని జలసంగి గ్రామంలోని ఓ ఇంటిపై పడింది. వాతావరణ పరిశోధన కోసం TIFR హైదరాబాద్ నుండి విడుదల చేయబడిన బెలూన్, మెరిసే ఎరుపు కాంతితో కూడిన పెద్ద పేలోడ్ తీసుకువెళ్లింది. అయితే ఇది ఒక్కసారిగా పడిపోవడం స్థానికులను ఆందోళనకు గురి చేసింది.
వెంటనే బెలూన్‌తో పాటు భారీ యంత్రమొకటి ఆకాశంలో నుంచి ఊడిపడినట్లు జల్సంగి గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే హొమ్నాబాద్ తాలూకా పోలీసులు స్పాట్‌కు చేరుకుని బెలూన్‌ను దానికి ఉన్న యంత్రాన్ని పరిశీలించారు. దానిపై ఉన్న ఒక లేఖ ఆధారంగా ఆ బెలూన్ యంత్రం టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(TIFR)కు చెందిందని పోలీసులు తేల్చారు.
ఇస్రో కొత్త చీఫ్‌గా వి నారాయణన్, చంద్రయాన్-4, గగన్‌యాన్ మిషన్లపై కీలక అప్‌డేట్ ఇచ్చిన వి నారాయణన్
విషయం క్లారిటీ రావడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాద్‌లోని తమ కేంద్రం నుంచి టీఐఎఫ్‌ఆర్ ఆకాశంలోకి బెలూన్ యంత్రాలను వదిలి వాతావరణంపై పరిశోధనలు చేస్తుంటుంది. హొమ్నాబాద్ పోలీసులు బెలూన్ గురించి సమాచారమివ్వడంతో టీఐఎఫ్‌ఆర్ బృందం అక్కడికి బయలుదేరి వెళ్లింది. బెలూన్ యంత్రం నింగిలో నుంచి ఊడిపడిన విషయాన్ని సోషల్‌మీడియాలో పలువురు నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఎలాంటి గాయాలు కానప్పటికీ, ఊహించని విధంగా ల్యాండింగ్ గ్రామస్థులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఘటనపై విచారణ కొనసాగుతోంది.
Massive TIFR Research Balloon Lands on House in Bidar
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)