TS Minister KTR: సోము వీర్రాజు క్వార్టర్ సీసా రూ.50 వ్యాఖ్యలు, ఎంత సిగ్గుమాలిన హామీ అంటూ ట్విట్టర్లో సెటైర్ వేసిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

ఎంత గొప్ప‌ పథకం.. ఎంత సిగ్గుమాలిన హామీ.. బీజేపీ ఏపీ నైతిక‌త విష‌యంలో మ‌రింత దిగ‌జారింది. చీప్ లిక్కర్‌ను రూ.50కి సరఫరా చేయాలనేదే బీజేపీ జాతీయ విధాన‌మా? లేదంటే నిరాశ అధికంగా ఉన్న‌ రాష్ట్రాలకు మాత్రమే బీజేపీ ఈ బంపర్ ఆఫర్ ఇస్తుందా?' అని ఎద్దేవా చేశారు.

Somu Verraju (Photo-ANI)

ఆంధ్రప్రదేశ్ లో తాము అధికారంలోకి వ‌స్తే మద్యం (లిక్కర్) క్వార్టర్ సీసాను రూ.50కే విక్రయించేలా చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ లో దీనిపై సెటైర్‌లు వేశారు. నిన్న సోము వీర్రాజు మాట్లాడిన ఆ వీడియోను పోస్టు చేశారు. 'వాహ్‌.. ఎంత గొప్ప‌ పథకం.. ఎంత సిగ్గుమాలిన హామీ.. బీజేపీ ఏపీ నైతిక‌త విష‌యంలో మ‌రింత దిగ‌జారింది. చీప్ లిక్కర్‌ను రూ.50కి సరఫరా చేయాలనేదే బీజేపీ జాతీయ విధాన‌మా? లేదంటే నిరాశ అధికంగా ఉన్న‌ రాష్ట్రాలకు మాత్రమే బీజేపీ ఈ బంపర్ ఆఫర్ ఇస్తుందా?' అని ఎద్దేవా చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)