MK Stalin Rides Bicycle: అమెరికాలో స్టాలిన్ సైకిల్ సవారీ వీడియో వైరల్, చెన్నైలో మనిద్దరం ఎప్పుడు సైకిల్ తొక్కుదామంటూ రాహుల్ గాంధీ రిప్లై, తమిళనాడు సీఎం ఏమన్నారంటే..
షికాగో సరస్సు తీరంలో సైకిల్ తొక్కుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) వెంటనే స్పందించారు
అమెరికా పర్యటనలో ఉన్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin).. షికాగో సరస్సు తీరంలో సైకిల్ తొక్కుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) వెంటనే స్పందించారు. చెన్నైలో మనమిద్దరం కలిసి ఎప్పుడు సైక్లింగ్ చేద్దాం బ్రదర్ అంటూ ట్వీట్ చేశారు.దీనికి బదులిచ్చిన స్టాలిన్.. ‘‘డియర్ బ్రదర్.. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు సైకిల్ తొక్కుతూ చెన్నై నగరాన్ని చుట్టేద్దాం. దీంతోపాటు మీకోసం మిఠాయిలు కూడా వేచిచూస్తున్నాయి. వీడియో ఇదిగో, సింగపూర్‌లో డోలు వాయించిన ప్రధాని నరేంద్ర మోదీ, అన్నయ్యా అంటూ రాఖీ కట్టిన మహిళ
సైక్లింగ్ తర్వాత మా ఇంట్లో దక్షిణాది వంటకాన్ని ఆస్వాదించి.. స్వీట్ల రుచి చూద్దాం’’ అని స్టాలిన్ పేర్కొన్నారు. వీరి ఆన్‌లైన్ సంభాషణ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడుకు పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అమెరికా పర్యటన చేపట్టారు. ఈ క్రమంలో తీరిక వేళ షికాగోలో సైకిల్ రైడ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ‘ఎక్స్’లో పోస్టు చేసిన ఆయన.. ‘‘కొత్త కలలకు సంధ్యా సమయం వేదికగా నిలుస్తుంది’’ అంటూ పేర్కొన్నారు.
Here's Tweets
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)