Monkey Enters Inside Ram Temple: రామ మందిరంలోకి ప్రవేశించిన కోతి, బాలక్ రామ్‌ను దర్శించుకునేందుకు రాముడి విగ్రహం సమీపంలోకి వెళ్లిన వానరం
స్వామి దర్శనానికి సోమవారం రాత్రి నుంచే క్యూ కట్టిన భక్తులతో పాటు ఎక్కడి నుంచి, ఎలా వచ్చిందో తెలియదు కానీ ఓ కోతి కూడా బాలక్ రామ్ ను దర్శించుకుంది. ఏకంగా గర్భాలయంలో రాముడి విగ్రహం సమీపంలోకి వెళ్లింది.
నిన్నటి నుండి అయోధ్య రాముడి దర్శనానికి సాధారణ భక్తులను అనుమతించారు. మంగళవారం ఒక్కరోజే దాదాపు 5 లక్షల మంది భక్తులు బాలక్ రామ్ ను దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆలయంలో చోటుచేసుకున్న ఘటన పూజారులను, భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. స్వామి దర్శనానికి సోమవారం రాత్రి నుంచే క్యూ కట్టిన భక్తులతో పాటు ఎక్కడి నుంచి, ఎలా వచ్చిందో తెలియదు కానీ ఓ కోతి కూడా బాలక్ రామ్ ను దర్శించుకుంది. ఏకంగా గర్భాలయంలో రాముడి విగ్రహం సమీపంలోకి వెళ్లింది.
విగ్రహాన్ని పడేస్తుందేమోననే భయంతో దానిని పట్టుకునేందుకు సెక్యూరిటీ సిబ్బంది పరుగెత్తుకు రాగా.. వారిని చూసి ఎలాంటి గొడవ చేయకుండా వెనుదిరిగి వెళ్లిపోయింది. ఈ ఘటనపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బుధవారం స్పందించింది. తన రాముడిని పూజించుకోవడానికి స్వయంగా హనుమంతుడే వచ్చాడని భావిస్తున్నట్లు ట్వీట్ చేసింది.
Here's Tweet