Game Changer: వీడియో ఇదిగో, గేమ్ ఛేంజర్ నుంచి నానా హైరానా పాటను తొలగించిన మేకర్స్, జనవరి 14 నుంచి ఈ సాంగ్‌ని మూవీలో జోడిస్తామని వెల్లడి
Naanaa Hyraanaa Song Removed: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్' మూవీ ఇవాళ (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రంలోని అద్భుతమైన ‘నానా హైరానా’ అనే మెలోడి సాంగ్‌ను చిత్రబృందం తాత్కాలికంగా తొలగించింది. అనివార్యమైన కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా ప్రస్తుతానికి ప్రదర్శించలేకపోతున్నామని తెలిపింది. ‘‘ఇన్‌ఫ్రారెడ్ ఇమేజ్‌ల ప్రాసెసింగ్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవ్వడంతో అందరికీ ఇష్టమైన ‘నానా హైరానా’ పాటను ప్రస్తుతం ప్రదర్శించలేకపోతున్నాం. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాం. జనవరి 14 నుంచి ఈ సాంగ్‌ని మూవీలో జోడిస్తాం. ఇందుకోసం చిత్ర బృందం రాత్రి, పగలు కృషి చేస్తోంది’’ అని చిత్ర బృందం వివరించింది.యూట్యూబ్‌లో కోట్లాది వ్యూస్‌తో అలరించిన పాట సినిమాలో ప్రస్తుతానికి లేకపోవడంతో చెర్రీ ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు.
Naanaa Hyraanaa Song from Game Changer Removed
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)