New Parliament Building Leaking? కొత్త పార్లమెంట్ భవనంలో వర్షపు నీరు లీక్, బయట పేపర్ లీకేజీ, లోపల వాటర్ లీకేజీ అంటూ మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలు
వాటర్ లీక్ కు సంబంధంచిన వీడియోలను ఆయా పార్టీల నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
నరేంద్ర మోదీ సర్కారు నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ కావడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వాటర్ లీక్ కు సంబంధంచిన వీడియోలను ఆయా పార్టీల నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీ మాణిక్ ఠాగూర్ గురువారం లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.బయట పేపర్ లీకేజీ, లోపల వాటర్ లీకేజీ అంటూ మోదీ ప్రభుత్వంపై ఆయన ఎక్స్ వేదికగా వ్యంగ్య బాణాలు సంధించారు. ఈ భవనం ప్రారంభించిన ఏడాదికే వర్షపు నీరు లీక్ కావడం ఏమిటని ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వాన్ని ఆయన గట్టిగా నిలదీశారు. వీడియో ఇదిగో, భారీ వరదలకు 5 సెకండ్లలో కుప్పకూలిన భారీ భవనం, పార్వతీ నదిలో కొట్టుకుపోయిన భవన శిథిలాలు
మాజవాదీ పార్టీ అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ పార్లమెంట్ పాత భవనానికి మార్చాలని, సమావేశాలు అందులో నిర్వహించాలని ప్రధాని మోదీకి సూచించారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా తన అధికారిక ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది. సెంట్రల్ విస్టా రీ డవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నిర్మించారు. రూ. 862 కోట్లు ఖర్చుతో 64,500 స్క్వేర్ మీటర్ల స్థలంలో ఈ భవనాన్ని నిర్మించారు. గతేడాది మే 23వ తేదీన ప్రధాని మోదీ ఈ సెంట్రల్ విస్టా భవనాన్ని ప్రారంభించిన విషయం విధితమే. అయితే ఈ సెంట్రల్ విస్టా భవనం ప్రారంభోత్సవానికి ప్రతిపక్షంలోని కాంగ్రెస్ పార్టీతోపాటు పలు పార్టీల నేతలు డుమ్మా కొట్టారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)