హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో వర్షం బీభత్సం సృష్టించింది. కులులోని నిర్మంద్‌ బ్లాక్‌, మాలానా, మండి, సిమ్లా జిల్లాల్లో క్లౌడ్‌ బరస్ట్‌ (Cloudburst) కారణంగా కుండపోత వర్షం కురిసింది. దాంతో ఇండ్లు, పాఠశాలలతో పాటు ఆసుపత్రులు సైతం దెబ్బతిన్నాయి. ఈ వర్షాలకు రాష్ట్రంలోని పలు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.భారీ వరదలకు ఇదందరు మృతి చెందగా మూడు ప్రాంతాల్లో దాదాపు 36 మంది గల్లంతయ్యారు. సిమ్లా జిల్లాలోని రాంపూర్‌ ప్రాంతంలో ఓ భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది (Building collapses). అనంతరం పార్వతీ నదిలో కొట్టుకుపోయింది (Building Washed Away). ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వయనాడ్ తర్వాత ప్రకృతి ప్రకోపానికి బలైన హిమాచల్‌ ప్రదేశ్‌, భారీ వరదలకు ఇద్దరు మృతి, మరో 36 మంది గల్లంతు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)