Rs 1,500 for Hugging Trees: చెట్లను కౌగిలించుకునేందుకు రూ.1500 రుసుము.. మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకంటూ బెంగళూరులో ఓ కంపెనీ కార్యక్రమం.. విమర్శలు
మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఈ నెల 28న తాము ‘ఫారెస్ట్ బాతింగ్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు బెంగళూరులోని ట్రోవ్ ఎక్స్ పీరియెన్సెస్ అనే కంపెనీ ప్రకటించింది.
Bengaluru, Apr 22: మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఈ నెల 28న తాము ‘ఫారెస్ట్ బాతింగ్’ (Forest Bathing) కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు బెంగళూరులోని (Bengaluru) ట్రోవ్ ఎక్స్ పీరియెన్సెస్ అనే కంపెనీ ప్రకటించింది. ఇందులో చెట్లను కౌగిలించుకోవడం, అడవిలో నడవడం వంటివి ఉంటాయని పేర్కొంది. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే, ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు ఒక్కొక్కరు రూ.1,500 చెల్లించాలని ప్రకటించింది. ఈ ప్రకటన చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘మార్కెట్‌లోకి కొత్త స్కామ్ వచ్చింది.. చెట్లను కౌగిలించుకునేందుకు రూ.1,500 ఏంటి?’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)