Gukesh Record in FIDE Candidates 2024 (Credits: X)

Newdelhi, Apr 22: ఫిడే క్యాండిడేట్స్‌ టోర్నీలో (FIDE Candidates 2024) భారత యువ సంచలనం గుకేశ్‌ (Gukesh) విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో 17 ఏండ్లకే ప్రతిష్టాత్మక టోర్నీ టైటిల్‌ దక్కించుకున్న అతిపిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ విజయంతో ప్రపంచ చాంపియన్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించిన రెండో భారతీయుడిగా, మొదటి టీనేజర్‌ గా నిలిచాడు. క్లాసికల్‌ వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ లో చైనా గ్రాండ్‌ మాస్టర్‌ డింగ్‌ లిరెన్‌తో తలపడనున్నాడు. అంతకు ముందు ఈ టోర్నికి భారత గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ క్వాలిఫై అయ్యారు.

IPL 2024, KKR vs RCB: ఆర్సీబీ కథ కంచికి.. ఉత్కంఠ పోరులో కోల్ కతా చేతిలో ఒక్కపరుగు తేడాతో బెంగుళూరు ఓటమి..

విశ్వనాథన్‌ ఆనంద్‌ విషెస్

ప్రపంచ చాంపియన్‌ షిప్‌ ఆడనున్న గుకేశ్‌ ను చెస్‌ లెజెండ్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ శుభాకాంక్షలు తెలిపారు. అతి పిన్న వయస్కుడైన చాలెంజర్‌ గా మారినందుకు అభినందిచారు. నీ విజయానికి వాకా చెస్‌ (WacaChess) కుటుంబం చాలా గర్వపడుతున్నదన్నారు.

2024 భారతదేశం ఎన్నికలు: మా అన్న‌య్య జోలికి వ‌స్తే స‌హించేది లేదు! చిరంజీవిపై స‌జ్జ‌ల వ్యాఖ్య‌ల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్