Odisha: షాకింగ్ వీడియో, సీటి స్కాన్ చేయడంలో ఆలస్యం, డాక్టర్‌ని చెప్పుతో కొట్టిన పేషెంట్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీసీ టీవీ పుటేజీ
ఒడిశాలోని సంబల్పూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో సీటి స్కాన్ చేయడంలో తీవ్ర జాప్యం చేశాడనే కోపంతో డాక్టర్‌ను చెప్పుతో కొట్టిన వ్యాపారిని ఒడిషా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒడిశాలోని సంబల్పూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో సీటి స్కాన్ చేయడంలో తీవ్ర జాప్యం చేశాడనే కోపంతో డాక్టర్‌ను చెప్పుతో కొట్టిన వ్యాపారిని ఒడిషా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన అక్కడి సీసీటీవీలో రికార్డయింది. వైరల్ వీడియో ప్రకారం.. వైద్యుడి సిఫార్సు మేరకు నిందితుడు నటబర్ బంక సీటీ స్కాన్ కోసం ప్రైవేట్ ల్యాబ్‌కు వెళ్లాడు.
సీటీ స్కాన్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన అనంతరం క్యూలో వేచిఉన్నాడు. గంటల తరబడి క్యూలో నిలుచున్నా చాలా సేపు వేచిఉండాల్సి రావడంతో సహనం కోల్పోయిన నటబర్ ఆస్పత్రి సిబ్బంది ఎదుటే డాక్టర్‌ను చెప్పుతో కొట్టాడు.నిందితుడి దాడితో డాక్టర్ చిదానంద మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)