Fact Check: రూ. 25 వేల పెట్టుబడితో నెలకు రూ. 15 లక్షలు, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ చెబుతున్నట్లుగా ఫేక్ వీడియో క్రియేట్, ఇలాంటివి నమ్మవద్దని హెచ్చరించిన కేంద్రం

ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన వీడియోలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 25 వేల రూపాయల పెట్టుబడి ద్వారా రోజూ 60 వేల రూపాయలు, నెలకు 15 లక్షల రూపాయలు సంపాదించవచ్చని హామీ ఇస్తూ ప్రోత్సహిస్తున్నట్లు చూపించబడుతోంది.

PIB said that the viral clip of Nirmala Sitharaman is a digitally altered fake video (Photo credits: X/@PIBFactCheck)

ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన వీడియోలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 25 వేల రూపాయల పెట్టుబడి ద్వారా రోజూ 60 వేల రూపాయలు, నెలకు 15 లక్షల రూపాయలు సంపాదించవచ్చని హామీ ఇస్తూ ప్రోత్సహిస్తున్నట్లు చూపించబడుతోంది. వీడియోలో ఒక జర్నలిస్ట్ నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నిస్తూ..భారత పౌరులు కనీసం 25 వేల రూపాయల పెట్టుబడితో నెలకు 15 లక్షల రూపాయలు సంపాదించవచ్చా?” అని అడుగుతున్నాడు. మంత్రీ సమాధానంగా, “అవును, నేను ఈ పథకాన్ని వ్యక్తిగతంగా ఉపయోగిస్తున్నానని చెప్పినట్లు చూపించారు.

షాకింగ్ వీడియో ఇదిగో, షాపుకు వెళుతున్న యజమానిపై అకస్మాత్తుగా దాడి చేసిన ఎద్దు, చికిత్స పొందుతూ బాధితుడు మృతి

అయితే, ఈ వీడియో నిజం కాదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) నిర్వహించిన వాస్తవ తనిఖీలో ఇది డిజిటల్‌గా మార్పుచేసిన నకిలీ వీడియోగా తేలింది. PIB స్పష్టం చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భారత ప్రభుత్వం ఇలాంటి పెట్టుబడి పథకాన్ని ప్రారంభించలేదు, మద్దతు కూడా ఇవ్వలేదని తేలింది.ప్రజలు మోసపూరిత పెట్టుబడి వాదనల నుంచి జాగ్రత్త పడాలని PIB హెచ్చరిస్తోంది.మీరు సోషల్ మీడియాలో చూసే సమాచారాన్ని ఎల్లప్పుడూ ధృవీకరించండని PIB పేర్కొంది. మోసగాళ్లు ప్రజలను డీప్‌ఫేక్ (Deepfake) వీడియోల ద్వారా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందువల్ల, ఎలాంటి పెట్టుబడి చేయకముందు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా సమాచారం పరిశీలించాలని తెలిపింది.

Is Nirmala Sitharaman Promoting an Investment Platform? PIB Says Video Is Digitally Altered 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement