PM Narendra Modi: ఢిల్లీ ఎన్నికల ప్రచారం.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాళ్లు మొక్కిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

రవీంద్ర సింగ్ ప్రధాని మోదీ కాళ్లు తాకేందుకు ప్రయత్నించగా, మోదీ వెంటనే ఆపారు. ఆశ్చర్యకరంగా మోదీనే స్వయంగా రవీంద్ర సింగ్ నేగీ కాళ్లు తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.

PM Narendra Modi bows feet of BJP MLA candidate Ravinder Negi (X)

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)బుధవారం ఢిల్లీలోని కరావల్ నగర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ వేదికపైకి చేరుకున్న తర్వాత, బీజేపీకి చెందిన వివిధ నియోజకవర్గాల అభ్యర్థులను ఆయనతో కలవడానికి ఆహ్వానించారు.

ఈ క్రమంలో పట్పర్గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రవీంద్ర సింగ్ నేగీ(Ravinder Negi) ప్రధాని వద్దకు వెళ్లారు. రవీంద్ర సింగ్ ప్రధాని మోదీ కాళ్లు తాకేందుకు ప్రయత్నించగా, మోదీ వెంటనే ఆపారు. ఆశ్చర్యకరంగా మోదీనే స్వయంగా రవీంద్ర సింగ్ నేగీ కాళ్లు తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో మోదీ రవీంద్ర నేగీని తన కాళ్లు తాకకుండా ఆపే ప్రయత్నం చేయడం ఆ తర్వాత తానే ఆయన కాళ్లు తాకడం స్పష్టంగా కనిపించింది. దీంతో ప్రధానమంత్రి మోదీపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మోదీ గొప్పతనానికి ఇది నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ పై తీవ్ర విమర్శలు చేశారు మోదీ.  నేడు మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన సూక్తులను ఫోటో గ్రీటింగ్స్ రూపంలో షేర్ చేయండిలా..

PM Narendra Modi bows feet of BJP MLA candidate Ravinder Negi

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

Advertisement
Advertisement
Share Now
Advertisement