జనవరి 30 భారత దేశ చరిత్రలో ప్రత్యేకమైన రోజు. ఈ రోజున, జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని ప్రతి సంవత్సరం అమరవీరుల దినోత్సవంగా నిర్వహిస్తారు. భారత స్వతంత్ర ఉద్యమంలో ఆయన చేసిన అమూల్యమైన సేవలకు గుర్తుగా, ఈ రోజు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించబడుతుంది.   భారతదేశానికి స్వతంత్రం చేకూర్చేందుకు మహాత్మా గాంధీ బ్రిటిష్ వారిపై అనేక ఉద్యమాలు నిర్వహించారు. అహింసా, సత్యాగ్రహం సిద్ధాంతాలతో దేశ ప్రజలను ఐక్యపరిచారు. స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఆయన పలుమార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దేశం కోసం ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించేందుకు, గాంధీజీ వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు.   భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం లభించింది. అయితే, స్వతంత్రం వచ్చిన కొద్దిమాసాలకే, 1948 జనవరి 30న మహాత్మా గాంధీ ఢిల్లీలోని బిర్లా హౌస్‌లో నాథూరామ్ గాడ్సే చేతిలో కాల్చి హత్య చేయబడ్డారు. ఈ ఘటన దేశాన్ని విషాదంలో ముంచేసింది. ఈ కారణంగా, ఆయన వర్ధంతిని ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో అమరవీరుల దినోత్సవంగా నిర్వహిస్తూ, గాంధీజీతో పాటు దేశ స్వతంత్రానికి ప్రాణత్యాగం చేసిన అమరవీరులందరికి నివాళులర్పిస్తారు.  అమరవీరుల దినోత్సవం సందర్భంగా, దేశ స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల సేవలను స్మరించుకుంటారు. ఈ రోజు, భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర ప్రముఖులు రాజ్‌ఘాట్‌ను సందర్శించి గాంధీజీ సమాధికి పుష్పాంజలి ఘటిస్తారు. దేశవ్యాప్తంగా ప్రజలు రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తూ అమరవీరులను స్మరిస్తారు.   మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో జన్మించారు. ఆయన జీవితమంతా శాంతి, అహింస, సమానత్వం కోసం పాటుపడ్డారు. భారతదేశానికి మాత్రమే కాక, ప్రపంచానికి సైతం గొప్ప స్ఫూర్తిదాయకమైన నాయకుడిగా నిలిచారు.

నీకు లోకంలో మార్పు కావాలని ఉంటే, ఆ మార్పుకు నీవే ఆదర్శంగా ఉండాలి.

మహాత్మ గాంధీకి ఘన నివాళి

అహింసా బలహీనుల ఆయుధం కాదు, అది బలవంతుల గొప్ప ఆయుధం

మన జీవితంలో మనం చేసే పనులన్నింటిలోనూ నిజాయితీ, నైతికత ఉండాలి.

సంతోషం స్వతంత్రంగా లభించే విషయం కాదు, మన స్వంత నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.

సహనమే నిజమైన బలాన్ని చూపించే లక్షణం, కోపం కాదు