
జనవరి 30, 1948న ఢిల్లీలోని బిర్లా హౌస్‌లో జాతిపిత మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సే కాల్చిచంపారు. అతని వర్ధంతి కారణంగా, జనవరి 30ని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున, భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి మరియు ఇతరులు గాంధీజీ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించడం ద్వారా ఆయనను స్మరించుకుంటారు. ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరైన మహాత్మా గాంధీ జనవరి 30, 1948న మరణించారు. ఆయన 77వ వర్ధంతి సందర్భంగా, ఆయన జీవితం, వారసత్వం మనకు చాలా ముఖ్యమైనవి. గాంధీ గారి అహింస, సత్య సిద్ధాంతాలు భారతదేశం స్వాతంత్రం కోసం చేసిన పోరాటంలో కీలక పాత్ర పోషించాయి. బ్రిటిష్ పాలనను వ్యతిరేకించే మార్గంగా ఆయన శాంతియుత నిరసనలను ఎప్పుడూ అనుసరించారు. అహింసా ద్వారా చేసిన ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా అనేక జనరేషన్లను ప్రేరేపించాయి. ఆయన మతసామరస్యాన్ని, సామాజిక సమానత్వాన్ని, ఉద్ధారణ కోసం చేసిన కృషి ఇప్పటికీ మనలో ఆరాధనకు అర్హంగా ఉన్నాయి. గాంధీ గారి ఆలోచనలు నేటి రోజుల్లో కూడా ప్రేరణనిచ్చేలా ఉంటాయి. ఆయన జీవితం శాంతి, న్యాయం, సమానత్వం కోసం చేసిన గొప్ప పోరాటాన్ని తెలియజేస్తుంది. ఈ సందర్భంగా సందేశాన్ని గ్రీటింగ్ కార్డుల రూంలో మీ బంధుమిత్రులకు షేర్ చేసి మహాత్మా గాంధీకి నివాళి అర్పిద్దాం.
పూజ్య బాపూజీకి ఘన నివాళి..షహీద్ దివస్ 2025
పూజ్య బాపూజీకి ఘన నివాళి..షహీద్ దివస్ 2025
పూజ్య బాపూజీకి ఘన నివాళి..షహీద్ దివస్ 2025
పూజ్య బాపూజీకి ఘన నివాళి..షహీద్ దివస్ 2025