Allahabad High Court: ఎక్కువ కాలం భాగస్వామితో శృంగారానికి నిరాకరించడం మానసిక క్రూరత్వమే.. అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్య

తగిన కారణం లేకుండా జీవిత భాగస్వామితో ఎక్కువ కాలం శృంగారానికి నిరాకరించడం మానసిక క్రూరత్వం కిందికే వస్తుందని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. ఫ్యామిలీ కోర్టు తన విడాకుల అభ్యర్థనను తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ రవీంద్ర యాదవ్‌ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది.

Representational Image (Photo Credit: ANI/File)

Newdelhi, May 27: తగిన కారణం లేకుండా జీవిత భాగస్వామితో (Spouse) ఎక్కువ కాలం శృంగారానికి (Sex) నిరాకరించడం మానసిక క్రూరత్వం (Mental Cruelty) కిందికే వస్తుందని అలహాబాద్‌ హైకోర్టు (Allahabad High Court) పేర్కొంది. ఫ్యామిలీ కోర్టు తన విడాకుల అభ్యర్థనను తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ రవీంద్ర యాదవ్‌ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది. తనకు 1979లో వివాహమైందని, కొంత కాలం తర్వాత తన భార్య తనతో కలిసి జీవించేందుకు నిరాకరించిందని రవీంద్ర యాదవ్‌ ధర్మాసనానికి తెలిపారు. దీనిపై ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ ''పిటిషనర్‌ భార్యకు దాంపత్య బంధం మీద గౌరవం లేదు. ఆమె తన భర్తకు భార్యగా ఉండేందుకు సుముఖంగా లేదు. అందుకే వారి దాంపత్య జీవితం విచ్ఛిన్నమైంది'' అని వ్యాఖ్యానించింది. రవీంద్ర వివాహ బంధాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.

Yoga Mahotsav: సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ‘యోగా మహోత్సవ్’.. వీడియో ఇదిగో..

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement