Non-Veg Rice: నాన్ వెజ్ రైస్ వచ్చేస్తుంది.. సాధారణ బియ్యం కంటే 8 శాతం ప్రొటీన్లు, 7 శాతం కొవ్వు అధికం
దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొత్త రకం హైబ్రీడ్ నాన్ వెజ్ రైస్ (మాంసం బియ్యం-మీటీ రైస్)ని సృష్టించారు.
Newdelhi, Feb 17: బియ్యం (Rice) ద్వారా అధిక ప్రోటీన్లు పొందాలనుకొనేవారికి గుడ్ న్యూస్. దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొత్త రకం హైబ్రీడ్ నాన్ వెజ్ రైస్ (Non-Veg Rice) (మాంసం బియ్యం-మీటీ రైస్ (Meaty Rice))ని సృష్టించారు. ఈ బియ్యంలో పశు మాంసం, కొవ్వు కణాలుండేలా ప్రయోగశాలలో సాగు చేస్తారు. ఇందుకోసం ముందుగా బియ్యానికి చేపల నుంచి తీసిన జిగురు లాంటి పదార్థాన్ని పూస్తారు. దీనివల్ల పశు మాంస కణాలు దానికి అతుక్కుపోతాయి. తర్వాత వాటిని 11 రోజుల పాటు ఒక పాత్రలో సాగు చేస్తారు. సాధారణ బియ్యం కంటే 8 శాతం ప్రొటీన్లు, 7 శాతం కొవ్వు ఎక్కువగా ఉంటాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)