Spelling Mistake in Ram Mandir Invitation Card: రామమందిరం ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలో స్పెల్లింగ్ మిస్టేక్, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ఆహ్వాన పత్రికలో సెల్పింగ్ మిస్టేక్ పడింది. దీన్ని నెటిజన్లు భారీగా ట్రోల్ చేస్తున్నారు. Invitation కు బదులుగా Invitaion అని పడింది. ఇందులో T మిస్ కావడంతో నెటిజన్లు దీన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
Spelling Mistake in Ram Mandir Inauguration Invitation Card: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం అయింది. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జనవరి 22, 2024న మధ్యాహ్నం 12:20 గంటలకు జరగనుంది. 1,500-1,600 మంది "ప్రముఖ" అతిథులతో సహా దాదాపు 8,000 మంది ఆహ్వానితుల భాగస్వామ్యానికి సాక్ష్యంగా రామ మందిరం కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.
ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ , ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ ప్రసంగించనున్నారు. ఈ మేరకు అందరికీ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఆహ్వాన పత్రికలు వెళ్ళాయి. ఇదిలా ఉంటే ఆహ్వాన పత్రికలో సెల్పింగ్ మిస్టేక్ పడింది. దీన్ని నెటిజన్లు భారీగా ట్రోల్ చేస్తున్నారు. Invitation కు బదులుగా Invitaion అని పడింది. ఇందులో T మిస్ కావడంతో నెటిజన్లు దీన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. రామ్ మందిర్ ఇన్విటేషన్ కార్డ్ వీడియో ఇదిగో, శ్రీరాముని ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానాలు పంపుతున్న ట్రస్ట్
Here's Videos