Telangana Women in UP Elections: యూపీ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ.. జాన్‌ పూర్‌ బీఎస్పీ అభ్యర్థిగా శ్రీకళారెడ్డి..

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ ఒకరు పోటీ చేస్తున్నారు. క్రిమినల్ కేసులో శిక్ష పడడంతో ఆమె భర్త ఎన్నికల్లో పోటీ చేయడం కుదరడంలేదు.

Telangana Women in UP Elections (Credits: X)

Lucknow, Apr 19: ఉత్తర ప్రదేశ్ (Uttarpradesh) ఎన్నికల బరిలో తెలంగాణ (Telangana) మహిళ ఒకరు పోటీ చేస్తున్నారు. క్రిమినల్ కేసులో (Criminal Case) శిక్ష పడడంతో ఆమె భర్త ఎన్నికల్లో పోటీ చేయడం కుదరడంలేదు. దీంతో ఆయన తరఫున ఆమె బరిలో దిగారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌ లోని జాన్‌ పూర్‌ లోక్‌సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీ చేస్తున్నారు. బీఎస్పీ అభ్యర్థిగా ఆమె బరిలో నిలిచారు. 2009 ఎన్నికల్లో జాన్‌ పూర్‌ నుంచి ఆమె భర్త ధనంజయ్‌ సింగ్‌ బీఎస్పీ తరపున ఎంపీగా గెలిచారు. ఈసారి కూడా ఆయన పోటీ చేయాలని అనుకున్నప్పటికీ కిడ్నాప్‌, దోపిడీ కేసులో ఆయన జైలుపాలయ్యారు. దీంతో శ్రీకళారెడ్డి ఎన్నికల బరిలో దిగారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామానికి చెందిన శ్రీకళారెడ్డిది రాజకీయ కుటుంబం. ఆమె తండ్రి కీసర జితేందర్‌ రెడ్డి 1972లో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా సేవలు అందించారు.

Lok Sabha Elections 2024: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రారంభమైన లోక్‌ సభ తొలి దశ ఎన్నికల పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకోబోతున్న 16 కోట్ల మంది.. దేశవ్యాప్తంగా 102 నియోజకవర్గాల్లో మొదలైన ఓటింగ్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now