Armstrong's Murder Accused Killed: బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసు నిందితుడు తిరువేంగడం ఎన్ కౌంటర్ లో హతం
ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Chennai, July 14: తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై(chennai)లో బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్(Armstrong) ఇటీవల హత్యకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన తిరువేంగడం ఎన్ కౌంటర్ కు(encounter) గురయ్యాడు. చెన్నై సమీపంలో పోలీసుల ఎన్ కౌంటర్ లోఈ గ్యాంగ్ స్టర్ మరణించినట్టు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసులో మొత్తం ఇప్పటివరకు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో పొన్నై బాలా, రాము, తిరువేంగడం, తిరుమల, సెల్వరాజ్, మణివణ్ణన్, సంతృప్తి, అరుల్ ఉన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)