Telangana: డబ్బులు చెల్లించలేదని గాయానికి కట్టిన కుట్లు విప్పదీసిన ఆస్పత్రి సిబ్బంది, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తానని చెప్పినా వినకుండా దాడి

కామారెడ్డి పట్టణంలోని అపెక్స్‌ ఆస్పత్రిలో గాయాలకు కుట్లు వేసినందుకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది రోగిపై దాడి చేసి, కుట్లు విప్పేశారు. పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి బైక్‌పై వెళుతూ అదుపుతప్పి కిందపడిపోయాడు. గాయాలు కావడంతో పట్టణంలోని అపెక్స్‌ ఆస్పత్రికి వెళ్లాడు. కన్సల్టేషన్‌ ఫీజు కింద రూ.300 చెల్లించాడు.

Telangana: Apex hospital staff undid the bandages on the wound because Victim were not paid in Kamareddy

కామారెడ్డి పట్టణంలోని అపెక్స్‌ ఆస్పత్రిలో గాయాలకు కుట్లు వేసినందుకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది రోగిపై దాడి చేసి, కుట్లు విప్పేశారు. పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి బైక్‌పై వెళుతూ అదుపుతప్పి కిందపడిపోయాడు. గాయాలు కావడంతో పట్టణంలోని అపెక్స్‌ ఆస్పత్రికి వెళ్లాడు. కన్సల్టేషన్‌ ఫీజు కింద రూ.300 చెల్లించాడు.  ఇదేం దొంగతనం భయ్యా..! కాళ్ల మధ్యలో పెట్టుకొని రూ.10 వేల చీరలు దొంగతనం చేసిన మహిళలు.. ముస్తాబాద్ లో ఘటన.. వీడియో ఇదిగో..! 

ఆస్పత్రి సిబ్బంది అతని గాయాలకు కుట్లు వేసి.. వెయ్యి రూపాయలు బిల్లు వేశారు. అయితే బాధితుడి వద్ద నగదు లేకపోవడంతో క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లిస్తానని చెప్పాడు. ఆస్పత్రి సిబ్బంది దీనికి అంగీకరించకపోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆస్పత్రి సిబ్బంది బాధితుడితో పాటు అతడి స్నేహితులపై దాడికి పాల్పడ్డారు. ఆస్పత్రి సిబ్బంది తీరుపై బాధితుడు ఆందోళనకు దిగాడు. సుమారు అరగంటపాటు అతని ఆందోళన కొనసాగింది. అనంతరం బాధితుడు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నాడు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement