Encounter In J&K: షోపియాన్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం.. హతుల్లో కశ్మీరీ పండిట్ పురానా కృష్ణ భట్‌ హత్య కేసు నిందితుడు కూడా..

ఉగ్రవాదుల్లో ఒకడిని షోపియాన్‌కు చెందిన లతీఫ్ లోనెగా గుర్తించగా, మరొకడిని అనంతనాగ్‌కు చెందిన ఉమర్ నజీర్‌గా గుర్తించారు.

Credits: Twitter

Srinagar, Dec 20: జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) షోపియాన్ (Shopian) జిల్లాలోని ముంజ్ మార్గ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో (Encounter) లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు (Three Terrorists from Let) హతమయ్యారు. ఉగ్రవాదుల్లో ఒకడిని షోపియాన్‌కు చెందిన లతీఫ్ లోనెగా గుర్తించగా, మరొకడిని అనంతనాగ్‌కు చెందిన ఉమర్ నజీర్‌గా గుర్తించారు. కశ్మీరీ పండిట్ పురానా కృష్ణ భట్‌ హత్య కేసులో లతీఫ్ ప్రమేయం ఉండగా, నేపాల్‌కు చెందిన తిల్ బహదూర్ థాపా హత్య కేసులో ఉమర్ నజీర్ నిందితుడు. నిందితుల నుంచి ఏకే 47 తుపాకి, రెండు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉన్నది.

మొబైల్ డేటా వేగంలో భారత్ 105 ర్యాంక్.. 176.18 ఎంబీపీఎస్ వేగంతో ప్రపంచంలోనే ఖతార్ టాప్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)