Rahul Gandhi's New Look: రాహుల్‌ గాంధీ కొత్త లుక్‌ ఫోటోలు వైరల్‌, జుట్టు కత్తిరించి, గెడ్డం తీసేసి లెక్చరర్‌ మాదిరిగా కనిపిస్తున్న కాంగ్రెస్ నేత

భారత్‌ జోడో యాత్రలో ఫుల్‌ గడ్డం, జుట్టుతో కనిపించిన కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ కొత్త లుక్ లో కనిపించారు. జుట్టు కత్తిరించి, గెడ్డం తీసేసి..ఒక లెక్చరర్‌ మాదిరిగా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.లండన్ లో కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో రాహుల్‌ విద్యార్థులతో మాత్రమే ఉపన్యసించనున్నారు.

Rahul Gandhi's New Look (Photo-Twitter)

భారత్‌ జోడో యాత్రలో ఫుల్‌ గడ్డం, జుట్టుతో కనిపించిన కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ కొత్త లుక్ లో కనిపించారు. జుట్టు కత్తిరించి, గెడ్డం తీసేసి..ఒక లెక్చరర్‌ మాదిరిగా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.లండన్ లో కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో రాహుల్‌ విద్యార్థులతో మాత్రమే ఉపన్యసించనున్నారు. రాహుల్‌ కేం బ్రిడ్జ్‌లో బిగ్‌ డేటా అండ్‌ డెమోక్రసీ, ఇండియా-చైనా సంబంధాలు అనే అంశంపై యూనివర్సిటీ కార్పస్‌ క్రిస్టీ కాలేజ్‌ ట్యూటర్‌ అండ్‌ కోడైరెక్టర్‌, గ్లోబల​ హ్యూమానిటీస్‌ ఇనిషియేటివ్‌ డైరెక్టర్‌ అయిన శ్రుతి కపిలాతో కలసి కొన్ని సెషన్‌లు కూడా నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ ట్విట్టర్‌ వేదికగా భారత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్‌ గాంధీకి స్వాగతం పలకడం ఆనందంగా ఉంది అని పేర్కొంది. అందుకు సంబధించిన రాహుల్‌ కొత్త లుక్‌ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి.

Here's Rahul New Look

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now