Anand Mahindra: నేను ఎప్పటికీ అత్యంత ధనవంతుడిని కాలేను, నాకు నంబర్ వన్ అవ్వాలని కోరిక లేదు, ట్విట్టర్ యూజర్‌కి షాకింగ్ రిప్లై ఇచ్చిన ఆనంద్ మహీంద్రా
దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో మీరు 73వ స్థానంలో ఉన్నారు. నంబర్ 1 స్థానానికి ఎప్పుడు వస్తారు’ అని ట్వీట్ చేస్తూ అడిగారు అడిగారు. దీనికి ఆనంద్ మహీంద్రా తనదైన రిప్లై ఇస్తూ... ‘నిజమేంటంటే. నేను ఎప్పటికీ అత్యంత ధనవంతుడిని కాలేను. ఎందుకంటే అది నా కోరిక కాదు’ అంటూ చెప్పుకొచ్చారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. సమకాలీన అంశాల మీద ఎప్పుడూ స్పందిస్తుంటారు. ట్విట్టర్‌లో కోటి మంది ఫాలోవర్స్ ఉన్న ఆనంద్ మహీంద్రాను..తాజాగా ఓ నెటిజన్ దేశంలో అత్యంత సంపన్నుడిగా ఎప్పుడవుతారు..? అని ప్రశ్నించాడు. ‘దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో మీరు 73వ స్థానంలో ఉన్నారు. నంబర్ 1 స్థానానికి ఎప్పుడు వస్తారు’ అని ట్వీట్ చేస్తూ అడిగారు అడిగారు. దీనికి ఆనంద్ మహీంద్రా తనదైన రిప్లై ఇస్తూ... ‘నిజమేంటంటే. నేను ఎప్పటికీ అత్యంత ధనవంతుడిని కాలేను. ఎందుకంటే అది నా కోరిక కాదు’ అంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల దేశంలో అత్యంత సంపన్నుల జాబితా 2022ను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. 2.1 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులతో ఆనంద్ మహీంద్రా 91 స్థానంలో ఉన్నారు.
Here's Mahindra Reply