Tuna Fish: ఈ ఒక్క చేప ఖరీదు రూ.2.2 కోట్లు... బరువు ఎంతంటే?? (వీడియోతో)

సముద్రంలో దొరికే చేపల్లో అత్యంత రుచికరమైన వాటిలో టూనా చేప ఒకటి. ఇది భారీ సైజులో ఉండే చేప. దీని ఖరీదు అలా ఇలా ఉండదు. దీన్ని కొనేందుకు బడా వ్యాపారులు పోటీ పడతారు.

Credits: Twitter

Tokyo, Jan 9: సముద్రంలో దొరికే చేపల్లో అత్యంత రుచికరమైన వాటిలో టూనా చేప (Tuna Fish) ఒకటి. ఇది భారీ సైజులో ఉండే చేప. దీని ఖరీదు అలా ఇలా ఉండదు. దీన్ని కొనేందుకు బడా వ్యాపారులు పోటీ పడతారు.  సాధారణంగా పెద్ద టూనా చేపలను వేలం వేస్తారు. ఇటీవల న్యూ ఇయర్ (Newyear) సందర్భంగా జపాన్ లో (Japan) వేలం (Auction) వేసిన ఓ టూనాకు రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈ టూనా బరువు 212 కిలోలు కాగా, దీనికి వేలంలో రూ.2.2 కోట్ల ధర పలికింది. ఇది బ్లూ ఫిన్ రకం టూనా కావడంతో దీనికి అంత ధర పలికింది.

అభిమానులకు విజయ దేవరకొండ నుంచి ఊహించని గిఫ్ట్.. మనాలీ ట్రిప్ కు 100 మంది

టోక్యో సిటీలోని టయోసు ఫిష్ మార్కెట్ లో ఈ వేలం నిర్వహించగా, జపాన్ లో సూషీ రెస్టారెంట్లు నడిపే ఒనోడెరా గ్రూప్ చేజిక్కించుకుంది. కాగా, ఈ భారీ మత్స్యరాజాన్ని ఉత్తర అమెరికాలోని ఒమా వద్ద సముద్ర జలాల్లో పట్టుకున్నారు. ఇక్కడ దొరికే బ్లూ ఫిన్ టూనాలను బ్లాక్ డైమండ్స్ అని పేర్కొంటారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement