9,900 Crore in UP Man Account: పొరపాటున యూపీ వాసి ఖాతాలో 9,900 కోట్లు జమ.. మరి ఆ ఖాతాదారుడు ఏం చేశాడంటే?
యూపీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బాదోహి వాసి భాను ప్రకాశ్ తన బ్యాంక్ ఖాతాలో రూ. 9,900 కోట్ల రూపాయలు జమవ్వడం చూసి షాక్ తిన్నాడు.
Lucknow, May 20: యూపీలో (Uttarpradesh) షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బాదోహి వాసి భాను ప్రకాశ్ తన బ్యాంక్ ఖాతాలో (Bank Account) రూ. 9,900 కోట్ల రూపాయలు జమవ్వడం చూసి షాక్ తిన్నాడు. వెంటనే తన ఖాతా ఉన్న బరోడా యూపీ బ్యాంక్ కు వెళ్లి అధికారులకు ఈ విషయాన్ని తెలిపాడు. వారు కూడా అతని ఖాతాను పరిశీలించగా రూ.99, 99,94,95,999.99 నిల్వ ఉండటాన్ని గుర్తించారు. సాంకేతిక కారణాల వల్ల ఆ మొత్తం అతని ఖాతాలో పడినట్టు గుర్తించి ముందు జాగ్రత్తగా అతని ఖాతాను స్తంభింప చేసి తప్పును సవరించారు. సకాలంలో దీని గురించి తమకు తెలియజేసిన ఖాతాదారుడు భానుప్రకాశ్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)