Pet Dog in Backpack: బ్యాగ్‌లో కుక్కను పెట్టుకుని విమానాశ్రయంలోకి మహిళ, స్కానింగ్ చేసి ఒక్కసారిగా షాక్ తిన్న సిబ్బంది, సోషల్ మీడియాలో వీడియో వైరల్
బ్యాగ్‌ను చెక్ చేయగా అందులో బతికున్న కుక్క కనిపించింది. ఇది చూసిన సిబ్బంది ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ప్రయాణ సమయాల్లో ఎవరైనా పెంపుడు జంతువులను తెచ్చుకుంటే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.
అమెరికాలోని ఓ విమానాశ్రయంలో.. విమానంలోకి లగేజ్‌ని లోడ్ చేసేముందు ఓ ప్రయాణికురాలి బ్యాగ్‌ను స్కాన్ చేసిన సిబ్బందికి ఊహించని ఘటన ఎదురైంది. విస్కాన్‌సిన్ (Wisconsin) నగరంలోని డేన్ కంట్రీ రీజనల్ ఎయిర్‌పోర్ట్ (Dane County Regional Airport )లో ప్రయాణికులకు సంబంధించిన లగేజీని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది విమానంలోకి లోడ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికురాలికి సంబంధించిన కాలేజ్ బ్యాగ్‌ను ఎక్స్‌రే మెషీన్‌లోకి పంపగా అందులో గుర్తుపట్టలేని వస్తువు వారికి తారసపడింది.
దీంతో బ్యాగ్‌ను చెక్ చేయగా అందులో బతికున్న కుక్క కనిపించింది. ఇది చూసిన సిబ్బంది ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ప్రయాణ సమయాల్లో ఎవరైనా పెంపుడు జంతువులను తెచ్చుకుంటే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.
Here's Video