Uttar Pradesh: వీడియో ఇదిగో, కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడిన జవాన్, రైలు-ప్లాట్‌ఫారమ్ మధ్యలో ఇరుక్కుని మృతి

రాయ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.

RAF Jawan Slips While Boarding Moving Train at Aligarh Railway Station, Dies (Photo Credits: X/@nispakshpatrkar)

ఒక విషాద సంఘటనలో, ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ రైల్వే స్టేషన్‌లో RAF అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ బిందా రాయ్ కదులుతున్న రైలు మరియు ప్లాట్‌ఫారమ్ మధ్యలో ఇరుక్కుపోయాడు. రాయ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అలీఘర్‌లోని 104వ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న రాయ్, సెలవుపై బీహార్‌కు ఇంటికి వెళ్తున్నారు. అయితే రైలు ఎక్కుతుండగా జారి పడిపోయిడు. దీంతో రైలుకు ప్లాట్ ఫాంకు మధ్యలో ఇరుక్కుపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. పోస్ట్‌మార్టం అనంతరం అతని మృతదేహాన్ని ఆర్‌ఏఎఫ్‌కి అప్పగించగా వారు బీహార్‌లోని కుటుంబసభ్యులకు లాంఛనాలతో అప్పగించారు.

షాకింగ్ వీడియో ఇదిగో, క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన యంగ్ ప్లేయర్, ఆస్పత్రికి వెళ్లేలోగానే మృతి

Jawan Slips While Boarding Moving Train at Aligarh Railway Station

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)