Uttar Pradesh Shocker: యూపీలో దారుణం, మహిళను చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరించి, ముఖానికి నల్లరంగు వేయాలని పంచాయితీ తీర్పు, అక్రమ సంబంధం పెట్టుకుందనే ఆరోపణలే కారణం

తమ గ్రామానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే ఆరోపణతో పంచాయతీ ఆదేశాల మేరకు వివాహితను చెట్టుకు కట్టేసి, జుట్టు కత్తిరించి, ముఖం నల్లగా చేసిన ఘటన గురించి సోమవారం పోలీసులు తెలిపారు.

Woman’s Hair Chopped, Face Blackened and Tied to Tree Over ‘Extramarital Affair’ in Pratapgarh, 15 Arrested; Disturbing Video Surfaces

తమ గ్రామానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే ఆరోపణతో పంచాయతీ ఆదేశాల మేరకు వివాహితను చెట్టుకు కట్టేసి, జుట్టు కత్తిరించి, ముఖం నల్లగా చేసిన ఘటన గురించి సోమవారం పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హతిగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛోట్కీ ఇబ్రహీంపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి 15 మందిని అరెస్టు చేశారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. దారుణం, ఫోటోల కోసం పిల్లల్ని పెద్ద మొసలి నోరు దగ్గరికి పంపిన తల్లిదండ్రులు, సీన్ కట్ చేస్తే..

ఆ మహిళ భర్త ముంబైలో ఉంటూ తన భార్య అక్రమసంబంధం గురించి తెలుసుకున్న తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆదివారం మహిళ కుటుంబీకుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. పంచాయతీ ఆదేశాల మేరకు, మహిళను చెట్టుకు కట్టేసి, జుట్టు నరికి, ముఖం మసితో నల్లగా చేశారని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) (పశ్చిమ), సంజయ్ రాయ్ తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now