22 Snakes in Woman Passenger's Bag: వీడియో ఇదిగో, మహిళ ప్యాసింజర్ బ్యాగులో 22 పాములతో పాటు ఒక ఊసరవెల్లి, ఒక్కసారిగా షాక్ అయిన కస్టమ్స్ అధికారులు
తమిళనాడు రాజధాని చెన్నై విమానాశ్రయంలో ఒక మహిళా ప్రయాణికురాలి లగేజ్ బ్యాగుల్లో 22 పాములు (Snakes), ఒక ఊసరవెల్లి (Chameleon)ని చూసి కస్టమ్స్ అధికారులు షాక్ తిన్నారు.
తమిళనాడు రాజధాని చెన్నై విమానాశ్రయంలో ఒక మహిళా ప్రయాణికురాలి లగేజ్ బ్యాగుల్లో 22 పాములు (Snakes), ఒక ఊసరవెల్లి (Chameleon)ని చూసి కస్టమ్స్ అధికారులు షాక్ తిన్నారు. ఏప్రిల్ 28న ఒక మహిళ మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ఏకే13 విమానంలో తమిళనాడు రాజధాని చెన్నై విమానాశ్రయానికి చేరుకుంది. ఆ మహిళపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఆమె లగేజ్‌ను తనిఖీ చేశారు. ఆ మహిళకు చెందిన బ్యాగుల్లో పలు జాతులకు చెందిన 22 పాములు, ఒక ఊసరవెల్లి కనిపించాయి. వీటిని చూసి కస్టమ్స్ అధికారులు ఖంగు తిన్నారు. పాములు పట్టే వారిని రప్పించి ఆ పాములను స్వాధీనం చేసుకున్నారు.ఆ మహిళపై కస్టమ్స్ యాక్ట్‌తోపాటు వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన ఆ మహిళను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజులు కస్టడీ విధించడంతో రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)