MP Elections 2023: వీడియో ఇదిగో, ఎన్నికల్లో గెలుపు కోసం పకీర్ బాబాతో చెప్పులతో కొట్టించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి
ఈ ఎన్నికల్లో రత్లాం నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి పరాస్ సాక్లేచా ఈ ఉదయం రోడ్డు పక్కన ఉండే ఫకీరా బాబా వద్దకు వెళ్లి కొత్త చెప్పులు ఇచ్చారు. వాటిని తీసుకున్న బాబా.. పరాస్ నెత్తిపై చెడామడా వాయించాడు. ఆపై వాటితో చెంపలు చెళ్లుమనిపించాడు. ఆయన కొడుతున్నంతసేపు పరాస్ ఆనందంతో పరవశించిపోయారు.
మధ్యప్రదేశ్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. సెంటిమెంట్ కోసం పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి స్థానికంగా ఉన్న ఓ బాబాతో చెప్పులతో కొట్టించుకున్నారు. కాగా మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో రత్లాం నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి పరాస్ సాక్లేచా ఈ ఉదయం రోడ్డు పక్కన ఉండే ఫకీరా బాబా వద్దకు వెళ్లి కొత్త చెప్పులు ఇచ్చారు.
వాటిని తీసుకున్న బాబా.. పరాస్ నెత్తిపై చెడామడా వాయించాడు. ఆపై వాటితో చెంపలు చెళ్లుమనిపించాడు. ఆయన కొడుతున్నంతసేపు పరాస్ ఆనందంతో పరవశించిపోయారు. ఆయనతో చెప్పు దెబ్బలు తింటే ఎన్నికల్లో విజయం తథ్యమనే ఉద్దేశంతోనే ఆయనిలా చేశారు.మరి చెప్పు దెబ్బలకు ఓట్లు రాలుతాయో? లేదో? వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)