Turbulence in Plane: స్పానిష్‌ విమానంలో భారీ కుదుపులు.. ఓవర్‌ హెడ్‌ కంపార్ట్‌ మెంట్‌లో ఇరుక్కుపోయిన ఓ ప్రయాణికుడు.. మొత్తంగా 30 మంది ప్రయాణికులకు గాయాలు (వీడియోతో)

తాజాగా ఎయిర్‌ యూరోపాకు చెందిన ఓ విమానంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. స్పెయిన్‌ నుంచి ఉరుగ్వేకి వెళ్తున్న విమానం మార్గం మధ్యలో భారీ కుదుపులకు లోనైంది.

Turbulence in Plane (Credits: X)

Newdelhi, July 2: విమానాల్లో కుదుపులు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా ఎయిర్‌ యూరోపా (Air Europa)కు చెందిన ఓ విమానంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. స్పెయిన్‌ నుంచి ఉరుగ్వేకి వెళ్తున్న విమానం మార్గం మధ్యలో భారీ కుదుపులకు (Turbulence) లోనైంది. తీవ్రమైన కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు వారి సీట్ల నుంచి కిందపడిపోయారు. ఓ ప్రయాణికుడు ఏకంగా ఓవర్‌ హెడ్‌ కంపార్ట్‌ మెంట్‌ లో ఇరుక్కుపోయాడు. ఈ ఘటనలో సుమారు 30 మంది గాయపడ్డారు. దీంతో విమానాన్ని బ్రెజిల్‌ (Brazil)లో అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారాయి.

విమానం ఎక్కి గాలిలో ఎగరడం కాదు.. ఏకంగా రోదసిలోనే షికారు చేయొచ్చు. అది కూడా కేవలం రూ.200కే. మీకు కూడా ఈ అవకాశం ఉంది.. త్వరపడండి మరి!!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif