Video: ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర స్మార్ట్‌గా రూ. 40 లక్షలు కొట్టేసిన దొంగలు, సీసీ టీవీ పుటేజీ వైరల్, నిందితులను పట్టుకున్న ఢిల్లీ పోలీసులు
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట( Red Fort ) వద్ద మార్చి 1న ట్రాఫిక్ సిగ్నల్( Traffic Signal ) పడగానే ఆగిన ఓ ద్విచక్ర వాహనదారుడి బ్యాగులో నుంచి రూ. 40 లక్షలు మాయం చేశారు దొంగలు. ఢిల్లీకి చెందిన ఓ యువకుడు.. రూ. 40 లక్షల నగదు తీసుకొని బైక్‌పై వెళ్తున్నాడు. అయితే భారీగా నగదు తీసుకొని వెళ్తున్న ఆ యువకుడిని ఓ ముగ్గురు యువకులు అనుసరించారు.

ఎర్రకోట వద్ద సిగ్నల్ పడగానే.. బైక్‌ను ఫాలో అయిన ఆ ముగ్గురు క్షణాల్లోనే రూ. 40 లక్షల నగదును కొట్టేశారు. తన గమ్యస్థానానికి చేరుకున్న ద్విచక్ర వాహనదారుడు బ్యాగు తెరిచి చూడగా, నగదు మాయమైంది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎర్రకోట వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం ముగ్గురిలో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 38 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)