Video: ఏటీఎం నుంచి నగదు బదులు పాము పిల్లలు, ఒక్కసారిగా షాక్ తిని బయటకు పరిగెత్తిన విత్‌డ్రాయర్, వీడియో ఇదిగో..
ఏటీఎంకు మనీ విత్‌డ్రా కోసం ఓ వ్యక్తి వెళ్లాడు. విత్ డ్రాయల్ ప్రాసెస్ పూర్తియ్యాక డబ్బులు ఎదురు చూస్తుండగా ఒక పాముపిల్ల బయటకు వచ్చింది.
ఉత్తరాఖండ్ నైనిటాల్ జిల్లాలోని రామ్‌నగర్ కోసీ రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ ఏటీఏంలోంచి కరెన్సీ నోట్లకు బదులు పాము పిల్లలు బయటకు రావటం కలకలం రేపింది. ఏటీఎంకు మనీ విత్‌డ్రా కోసం ఓ వ్యక్తి వెళ్లాడు. విత్ డ్రాయల్ ప్రాసెస్ పూర్తియ్యాక డబ్బులు ఎదురు చూస్తుండగా ఒక పాముపిల్ల బయటకు వచ్చింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే ఏటీఎం సెక్యూరిటీ గార్డు ద్వారా సంబంధిత అధికారులు సమాచారం అందించారు.దీంతోపాటు సేవ్ ది స్నేక్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు చంద్రసేన్ కశ్యప్ కూడా సమాచారం అందించాడు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న బ్యాంకు అధికారులు.. ఏటీఎంను తెరిచారు. ఈ క్రమంలో ఏటీఎం మెషీన్‌లో ఏకంగా పది పాము పిల్లల్ని గుర్తించారు. వాటిని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు. వీడియో ఇదే..
Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)