Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, ఉపాధ్యాయురాలిపై హెడ్‌మాస్టర్ లైంగిక వేధింపులు..అడిగినందుకు విద్యాధికారిపై బెల్ట్‌తో దాడి, నిందితుడు అరెస్ట్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్ జిల్లాలోని మహమ్మదాబాద్ బ్లాక్‌లోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు బ్రిజేంద్ర కుమార్ వర్మ చేసిన దారుణ సంఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంఘటన ప్రకారం అదే పాఠశాలలో పనిచేస్తున్న ఓ మహిళా ఉపాధ్యాయురాలి పై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్ జిల్లాలోని మహమ్మదాబాద్ బ్లాక్‌లోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు బ్రిజేంద్ర కుమార్ వర్మ చేసిన దారుణ సంఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంఘటన ప్రకారం అదే పాఠశాలలో పనిచేస్తున్న ఓ మహిళా ఉపాధ్యాయురాలి పై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాధిత ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు, సీతాపూర్ జిల్లాకు చెందిన ‘బేసిక్ శిక్షా అధికారి (BSA)’ అఖిలేష్ ప్రతాప్ సింగ్ ఈ ఘటనపై దృష్టి పెట్టి, ప్రధానోపాధ్యాయుడి నుంచి వివరణ కోరారు.
వివరణ ఇచ్చేందుకు విద్యాధికారి కార్యాలయానికి వెళ్లిన బ్రిజేంద్ర కుమార్ తన పాఠశాల కార్యకలాపాలపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే అతడు ఇచ్చిన వివరణ విద్యాధికారి అఖిలేష్ ప్రతాప్ సింగ్ ను సంతృప్తి పరచలేదు. దీంతో ప్రధానోపాధ్యాయుడిలో ఆగ్రహం పెరిగింది. వెంటనే బ్రిజేంద్ర తన చేతిలో ఉన్న ఫైల్‌ను అధికారిపై విసిరేశాడు. అంతటితో ఆగకుండా, తన బెల్ట్‌ను తీసుకొని అఖిలేష్ ప్రతాప్ సింగ్ పై దాడి చేశాడు. ఈ దాడి ప్రాంతంలో ఉన్న ఇతర సిబ్బంది వెంటనే అతన్ని అడ్డుకున్నారు.
దాడి సంఘటనపై విద్యాధికారి ఫిర్యాదు చేసాడు. తరువాత పోలీసులు గమనించి, హెడ్మాస్టర్ బ్రిజేంద్రను అరెస్ట్ చేసి, ఘటనకు సంబంధించిన విచారణ కోసం కస్టడీలోకి తీసుకెళ్లారు. ఈ సంఘటన సామాజిక మీడియాలో వైరల్ అవ్వడంతో, పాఠశాలల్లో ఉద్యోగ నియమాలు, బాధ్యతలు, శిక్షణపై ప్రజల్లో ఆందోళన ఎక్కువైంది. అలాగే, శిక్షణలో ఉన్న అధికారులతో సంఘటనల వ్యవహారంలో అత్యవసర చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టమైందని అధికారులు తెలిపారు.
School headmaster assaults education officer
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)