Viral Video: వైరల్ వీడియో, మందును దొంగతనం చేసేందుకు షాపుకు కన్నం, అయితే మనసు మారి అక్కడే తాగడం మొదలు పెట్టడంతో పోలీసులకు చిక్కిన దొంగలు

తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలోవైరల్ ఘటన చోటు చేసుకుంది.స్థానికంగా నివశించే ఇద్దరు మందు బాబులు.. మద్యం కోసం ఒక లిక్కర్ షాపుకు కన్నం వేశారు.గోడకు కన్నం పెట్టి లోపలకు వెళ్లిన వారు కొంత మద్యం ఎత్తుకెళ్లి బయట అమ్ముకుందామని ముందుగా అనుకున్నారు.

Two men drilled a hole in the wall of a liquor shop & were boozing inside when caught redhanded by a patrol police in Thiruvallur

తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలోవైరల్ ఘటన చోటు చేసుకుంది.స్థానికంగా నివశించే ఇద్దరు మందు బాబులు.. మద్యం కోసం ఒక లిక్కర్ షాపుకు కన్నం వేశారు.గోడకు కన్నం పెట్టి లోపలకు వెళ్లిన వారు కొంత మద్యం ఎత్తుకెళ్లి బయట అమ్ముకుందామని ముందుగా అనుకున్నారు. అయితే లోపలకు వెళ్లాక వాళ్ల మనసులు మారిపోయాయి. దాంతో అక్కడే కూర్చొని తాగడం మొదలుపెట్టారు.

అదే సమయంలో రాత్రి పూట గస్తీ తిరుగుతున్న పోలీసులు దీన్ని గమనించారు. లిక్కర్ షాపు దగ్గరకు వెళ్లి టార్చ్ లైట్లతో లోపల జరుగుతున్న తంతును చూశారు. ఓనర్‌కు ఫోన్ చెయ్యడానికి ముందు.. గోడకు చేసిన కన్నం నుంచే వాళ్లిద్దరినీ బయటకు లాగారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now